: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్
తిరుమల శ్రీవారిని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలసి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు. నిన్న విడుదలైన లెజెండ్ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందుతుందని, ఇంకా పలు చిత్రాలకు సంగీతం సమకూర్చుతున్నట్టు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.