: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుపై అధ్యయనానికి కేంద్రప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కె.శివరామకృష్ణన్, ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్, ఆరోమర్ రేవి, డాక్టర్ రతీన్ రాయ్, ప్రొఫెసర్ జగన్ షా ఉంటారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు రాజస్థాన్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్ అహ్మద్, మహారాష్ట్ర డీజీపీ ఎ.ఎన్.రాయ్ లను సహాయకులుగా నియమించింది.