: ‘సైకిల్’ ఎక్కిన ఆర్.కృష్ణయ్య
వెనుకబడిన కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపధ్యంలో టీడీపీలోకి కృష్ణయ్య చేరిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.