: మోడీపై ఘాటు విమర్శలు చేసిన మసూద్ పై కేసు


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఘాటుగా విమర్శించిన ఉత్తరప్రదేశ్, సహరన్ పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ పై కేసు నమోదు అయ్యింది. మసూద్ గత శనివారం నాడు ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ చేస్తానంటున్నారని, దాని అర్థం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా... మోడీని ముక్కలుగా నరికేస్తానని మసూద్ మండిపడ్డారు. మసూద్ చేసిన వ్యాఖ్యలు యూపీలో పెనుదూమారం రేపడంతో తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. అయితే, పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. మసూద్ పై కేసు నమోదు చేసినట్టు ఐజీ అమరేంద్ర సేంగార్ మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News