: సైకిల్ వాడితే కాలుష్యరహితం... సైకిల్ కి ఓటేస్తే అవినీతి రహితం: ఫేస్ బుక్ లో వినూత్న ప్రచారం
ఎన్నికల వేళ పార్టీల ప్రచారం 'వాల్ పోస్టర్ల' నుంచి ఫేస్ బుక్ ‘వాల్’ పైకి చేరింది. తాజాగా తెలుగుదేశం పార్టీ నినాదం ఒకటి ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. 'సైకిల్ వాడకం కాలుష్యాన్ని పారదోలుతుంది... సైకిల్ కి వేసే ఓటు అవినీతిని పారదోలుతుంది' అంటూ టీడీపీ నినాదం ఫేస్ బుక్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.