: నర్సాపూర్ చెక్ పోస్టు వద్ద కోటి రూపాయలు పట్టుబడ్డాయ్!
మెదక్ జిల్లా పరిధిలోని నర్సాపూర్ చెక్ పోస్టు వద్ద 1.06 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఓ వాహనంలో నగదును తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. సొమ్ముకు సంబంధించి తగిన ఆధారాలు చూపనందున నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వాహనాన్ని కూడా సీజ్ చేశామని వారు చెప్పారు.