: మహేంద్ర సింగ్ ధోనీ మంచి ప్లేయరే కాదు... ట్యాక్స్ పేయర్ కూడా!
భారత క్రికెట్ రంగంలో ధనార్జనలో క్రికెట్ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోనీయే ముందు వరుసలో ఉన్నాడు. అంతేకాదు, ప్రతి ఏటా సకాలంలో ఆదాయపు పన్ను చెల్లించడంలోనూ ధోనీ ముందున్నాడు. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను ధోనీ 20 కోట్ల రూపాయల పన్ను చెల్లించాడు. ఈ విషయాన్ని ఓ సీనియర్ ఆదాయపు పన్ను శాఖాధికారి ధృవీకరించారు.
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా అత్యధిక ఇన్ కం ట్యాక్స్ చెలిస్తోంది ధోనీయే. వరుసగా ఆరో ఏడాది కూడా అత్యధిక పన్ను కట్టిన వ్యక్తిగా అతడు నిలిచాడు. మహీ గతేడాది రూ.22 కోట్ల పన్ను కట్టగా... ఈ సంవత్సరం రెండు కోట్లు తక్కువగా చెల్లించాడు. అతడి ఆదాయం కాస్త తగ్గి ఉండొచ్చని ఐటీ వర్గాలు తెలిపాయి. క్రికెట్ ఆటతో పాటు వ్యాపార ప్రకటనల్లో నటించడం ద్వారా మహీకి మరింత ఆదాయం సమకూరుతోన్న సంగతి తెలిసిందే.