: విశాఖ సత్యసాయి విద్యావిహార్ కు వచ్చిన సునీల్ గవాస్కర్
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇవాళ విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖలోని శ్రీసత్యసాయి విద్యా విహారును సందర్శించిన గవాస్కర్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన విద్యార్థులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. అక్కడి శ్రీ సాయిబాబా ఆలయంలో ఆయన పూజలు చేశారు.