: నేను ఆప్ లో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: కపిల్
తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నానని వస్తున్న వార్తలను టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఖండించారు. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేశారు. తాను ఆప్ తరపున ప్రచారం కూడా చేయబోవడంలేదని తెలిపారు.