: ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించాం: ఎర్రెబెల్లి
బాబ్లీ అంశంపై అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వాస్తవం బోధపడేలా చేశామని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సుప్రీం కోర్టు.. బాబ్లీ విషయంలో మనకు వ్యతిరేకంగా తీర్పిచ్చిందన్న విషయం ఇన్నాళ్ళకు సర్కారుకు అవగతం అయిందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. నేడు జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు.
అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎర్రబెల్లి చెప్పారు. ఇక, కడియం శ్రీహరి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి, బాబ్లీపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలని సూచించారు. బాబ్లీపై త్రిసభ్య కమిటీ నియామకం వృధా ప్రయాస అన్నారు. గతంలో తుంగభద్ర బోర్డు, కావేరీ ట్రైబ్యునల్ లు విఫలమయ్యాయని ఆయన గుర్తు చేశారు.