: మనుషులెవరూ నన్ను ఓడించలేరంటున్న బప్పీలహరి!


‘కమల దళం’లో చేరిన బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తన గెలుపుపై ఆయన అతివిశ్వాసంతో ఉన్నట్టు కనపడుతోంది. తనను దేవుడు తప్ప మనుషులెవరూ ఓడించలేరంటూ కోల్ కతాలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు తార్కాణం.

‘‘దేవుడు మాత్రమే ఓడించగలడు లేదా నాశనం చేయగలడు. ఏ మానవుడు లేదా ఏ పార్టీ నన్ను ఓడించలేదు’’ అని ఎన్నికల ప్రచారంలో బప్పీలహరి వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లా శ్రీరాంపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ తరపున ఆయన బరిలో దిగుతున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన ఆనందంతో చెప్పారు. శ్రీరాంపూర్ ను పర్యాటక కేంద్రంగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News