: కేసీఆర్ కుటుంబాన్ని హైదరాబాద్ నుంచి తరిమికొడతాం: మందకృష్ణ


మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాట మార్చారని మండిపడ్డారు. మాట మార్చడం ఆయన నైజమని అన్నారు. ఈ రోజు వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కాని, ఆయన కుటుంబ సభ్యులెవరైనా కాని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటే వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరినీ హైదరాబాద్ నుంచి తరిమికొడతామని వార్నింగ్ ఇచ్చారు. అసలు కేసీఆర్ మాట ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News