: పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా: చంద్రబాబు
ఓట్ల చీలిక తనకు ఇష్టం లేదని, మంచి రాజధాని ఎవరు నిర్మిస్తారో వారికే ఓటు వేయాలని పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. దానిని బట్టి ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు. దొంగలకు అధికారం ఇస్తే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని తెలిపారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే పరువు పోతుందని ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ రోజు జరిగిన సమావేశంలో బాబు మాట్లాడారు. సీమాంధ్రలో హైదరాబాద్ వంటి నగరాలను నిర్మిస్తామని ప్రకటించారు. ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని కోరిన బాబు.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వస్తే ఎవరేంటో తేలిపోతుందన్నారు.