: హెలికాప్టర్ రెడీ చేసుకున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో దూసుకుపోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఒక హెలికాప్టర్ ను సిద్ధం చేసుకున్నారు. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11 నుంచి కేసీఆర్ ప్రచార పర్వం మొదలవ్వాలి. అయితే, వీలైనంత ముందుగానే ప్రజల్లోకి వెళ్లాలనే భావనతో... ఏప్రిల్ 1 నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. హెలికాప్టర్ కూడా అందుబాటులోకి రావడంతో, రోజుకు మూడు నియోజకవర్గాలను కవర్ చేయాలనే భావనలో కేసీఆర్ ఉన్నారు. హైర్ కు తీసుకున్న హెలికాప్టర్ ఇప్పటికే కేసీఆర్ ఫాం హౌస్ లో ల్యాండ్ అయింది.