: మాజీ టెక్ జెయింట్ కోసం కర్ణాటకలో నెటిజెన్ల శోధన


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరాయమ్య కంటే కూడా మరో నేత కోసం కర్ణాటకలో నెటిజన్లు ఆన్ లైన్ లో తెగ శోధిస్తున్నారట. ఆ నేత ఎవరో కాదు ఇన్ఫోసిస్ మాజీ బాస్. కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని! టెక్కీ సంస్థ అధిపతి నుంచి కాంగ్రెస్ అనుగ్రహంతో ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించి, చివరికి రాజకీయ నేతగా నీలేకని మారిన విషయం తెలిసిందే. బెంగళూరు సౌత్ నుంచి కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నీలేకనికి సంబంధించిన వివరాల కోసం కర్ణాటకలోనే ఎక్కువ మంది గూగుల్లో వెతుకుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా పనిచేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అదే బెంగళూరు సెంట్రల్ నుంచే లోక్ సభకు పోటీ చేస్తున్న బాలకృష్ణన్ ఈ విషయంలో నీలేకని వెనుకనే ఉన్నారట. అంతేకాదు, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప వీరందరినీ కాదని నెటిజన్లలో నీలేకని పాప్యులర్ అయ్యారు. ఇక రాష్ట్ర నేతల కంటే జాతీయ నేతలైన మోడీ, రాహుల్, కేజ్రీవాల్ గురించి కర్ణాటక నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని గూగుల్ తెలిపింది. గత మూడు నెలల కాలంలో సెర్చింగ్ వివరాల ఆధారంగా గూగుల్ ఈ వివరాలు వెల్లడించింది.

  • Loading...

More Telugu News