: ఈ జీన్స్ వేస్తే సమ్మర్ లో ఏసీ ఫ్రీ!
చెమటలు కక్కించే వేడి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే.. అదీ జీన్స్ లో కాస్త అసౌకర్యంగా ఫీలవుతాం. చక్కగా గాలి చొరబడే డ్రెస్ వేసుకుంటే గాలి ఆడేందుకు వీలుంటుంది. ఇలాంటి కష్టాలను గుర్తించింది వ్రాంగ్లర్ అనే డ్రెస్ ల తయారీ కంపెనీ. ప్రత్యేక ఫినిషింగ్ తో సన్ షీల్డ్(ఎండకు రక్షణ) పేరుతో ఈ వేసవి కోసం నూతన వస్త్రశ్రేణిని వ్రాంగ్లర్ విడుదల చేసింది. ప్రత్యేక ఫినిషింగ్ వల్ల ఈ వస్త్రాలు ఎండను తక్కువగా తీసుకుంటాయని సంస్థ తెలిపింది. అంతేకాదు, సూర్యుని అల్ట్రావయలెట్ కిరణాల నుంచి రక్షణనిస్తాయని పేర్కొంది.