: టీడీపీలో చేరిన మోజెస్ రాజు, రంగనాథరాజు
టీడీపీలోకి ఇతర పార్టీ నేతల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మోజెస్ రాజు టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి బాబు టీడీపీలోకి ఆహ్వానించారు. అటు సీనియర్ నేత చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా తెలుగుదేశంలో చేరారు.