: స్టాలిన్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: కుష్బు
డీఎంకే నాయకురాలైన సినీనటి ఖుష్బు ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. ఏప్రిల్ ఐదో తేదీనుంచి 17 రోజుల పాటు ఆమె డీఎంకే తరపున ప్రచారం చేయనుంది. డీఎంకే వ్యక్తిగత విమర్శలకు వ్యతిరేకమని... అందువల్ల తాను డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్ కుమార్ ను వ్యక్తిగతంగా విమర్శించనని ఆమె తెలిపారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను, ఆ పార్టీ విధానాలను మాత్రం ఎండగడతానని ఖుశ్బ్ ఖుష్బు చెప్పారు. అదే సమయంలో, డీఎంకే యువత అధ్యక్షుడు స్టాలిన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని... వదంతులను నమ్మవద్దని ఆమె కోరారు.