: సీపీఐ-కాంగ్రెస్ పొత్తుపై చర్చిస్తున్నాం: పొన్నాల లక్ష్మయ్య


సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీపీఐతో పొత్తు అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. హైదరాబాదులో ఈరోజు (శుక్రవారం) పొన్నాల మీడియాతో మాట్లాడుతూ, సాయంత్రం సీపీఐ నారాయణతో జానారెడ్డి పొత్తుల విషయమై చర్చిస్తారని ఆయన చెప్పారు. పొత్తులపై ఈరోజు జరిగే భేటీలో స్పష్టత వస్తుందని పొన్నాల అన్నారు.

సీపీఐకు ఒక పార్లమెంటు స్థానంతో పాటు 8 నుంచి 10 శాసనసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కేటాయించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు విషయమై స్పందిస్తూ... కేసీఆర్ నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని పొన్నాల అన్నారు.

  • Loading...

More Telugu News