: మున్సి‘పోల్స్’పై హైకోర్టులో విచారణ


రాష్ట్రంలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మున్సి‘పోల్స్’ ఫలితాలను వెంటనే ప్రకటించాలా? లేదా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫలితాలను వెల్లడించాలా? అన్న అంశాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పరిశీలిస్తోంది. తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజున తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తే ఆ ప్రభావం ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోన్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News