: స్మార్ట్ ఫోన్లో ఎయిర్ టెల్ టీవీ


స్మార్ట్ ఫోన్లలోనే నచ్చిన టీవీ చానల్ చూసేందుకు వీలుగా ఎయిర్ టెల్ ఓ అప్లికేషన్ ను విడుదల చేసింది. దీనిని ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ తెలిపింది. నెలకు 60 రూపాయల చందా చెల్లిస్తే 150 చానళ్లు చూసుకోవచ్చని, అలాగే 10వేల గంటలపాటు నచ్చిన సినిమాలు, ఇతర టీవీల కార్యక్రమాలు కూడా పొందవచ్చని వెల్లడించింది. దీనికి డేటా చార్జీలు అదనం. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ వెర్షన్ లోనే విడుదల చేసింది. త్వరలోనే ఐఓఎస్, ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ లకు కూడా అందుబాటులోకి తెస్తామని ఎయిర్ టెల్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News