: పోలియో రహిత దేశంగా భారత్.. డబ్ల్యూహెచ్ వో వెల్లడి


కొంతకాలం వరకూ భారత్ ను పీడించిన పోలియో మహమ్మారి ఆనవాళ్లు ఇప్పుడెక్కడా మనదేశంలో లేవట. ప్రస్తుతం పోలియో రహిత దేశంగా భారత్ ను కూడా గుర్తించినట్లు ప్రప్రంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అధికారికంగా ధృవీకరించింది. దాంతో, పోలియో రహిత దేశాలుగా గుర్తింపు పొందిన పదకొండు ఆగ్నేయాసియా దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఈ మేరకు నిన్న (గురువారం) ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ అధికారిక ధ్రువపత్రాన్ని అందుకున్నారు. 1995 నాటికి భారత్ లో ప్రతి ఏడాది 50వేల మంది చిన్నారులు పోలియో మహమ్మారి బారినపడేవారని ఆజాద్ ఈ సందర్భంగా తెలిపారు. అప్పుడే పోలియోను దేశం నుంచి తరిమి కొట్టాలని కంకణం కట్టుకున్న భారత్.. ఈ 19 ఏళ్లలో ఈ వ్యాధిని సమూలంగా పారదోలినట్టు వివరించారు. ప్రతి చిన్నారికీ పోలియో వ్యాక్సిన్ లను అందించడంలో కృతకృత్యులయ్యామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News