: శాంతి కోసం బైకుపై 7,000 కిలోమీటర్లు


శాంతి కోసం ఉత్తరాఖండ్ కు చెందిన ఇద్దరు యువకులు బైకు యాత్ర నిర్వహించారు. హల్ద్ వాని పట్టణానికి చెందిన అవనీష్ రాజ్ పాల్, ముదిత్ అశోక్ వర్మ ఉత్తరాది రాష్ట్రాలు, నేపాల్లో పర్యటించి వచ్చారు. కేవలం 9 రోజుల్లోనే 7,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రజలకు శాంతి సందేశం వినిపించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, అసోం, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, బీహార్ రాష్ట్రాలలో 7 రోజులు... నేపాల్లోని ఏడు జిల్లాలలో పర్యటను రెండు రోజుల్లో పూర్తి చేసేశారు. మొత్తానికి ఈ పర్యటన ద్వారా ప్రజల్లో శాంతి పట్ల స్పృహ కల్పించడంతోపాటు ఈ ఇద్దరు యువకులు తమకంటూ మధుర స్మృతులను పోగేసుకున్నారు.

  • Loading...

More Telugu News