: బీసీసీఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గవాస్కర్... ఆదేశించిన సుప్రీంకోర్టు
ఐపీఎల్-7 నిర్వహణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని... షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ రోజు తెలిపింది. ఐపీఎల్ టోర్నీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ (తాత్కాలిక అధ్యక్షుడు)గా గవాస్కర్ వ్యవహరిస్తారని ప్రకటించింది. గవాస్కర్ ఈ హోదాలో ఉన్నన్ని రోజులు క్రికెట్ కామెంటేటర్ గా ఉండరాదని షరతు విధించింది. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టోర్నీలో పాల్గొనవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టోర్నీలో ఆడకుండా ఏ ఆటగాడిపై నిషేధం విధించడం లేదని స్పష్టం చేసింది. దీంతో, ఐపీఎల్-7కు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే... బీసీసీఐ ఉపాధ్యక్షులుగా ఉన్న ఐదు మందిలో ఎవరో ఒకరు బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించడానికి కోర్టు అనుమతించింది.