: మత్స్యకారుడి వలకు చిక్కిన 400 కిలోల భారీ చేప
సాధారణంగా పది కిలోల చేపను చూసినా, 'వామ్మో ఎంత పెద్దగా ఉందో' అనుకుంటాం. అలాంటిది ఏకంగా 400 కేజీల బరువున్న 'గుమ్మడం టేకు' చేప ఉప్పాడ సత్తిబాబు అనే మత్స్యకారుడి వలకు చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం చేపల రేవులో ఈ భారీ చేప వలలో పడింది. ఈ చేపను బోటుకు తాడు కట్టి ఒడ్డుకు లాక్కొచ్చారు. చేపను చూడ్డానికి భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఈ చేపను రూ. 24 వేలకు కొనుగోలు చేశారు. దీని పెంకులో ఉండే పూసలు రూ. 30 వేల ధర పలుకుతాయని చెబుతున్నారు. ఈ చేపను కేరళకు తరలిస్తున్నారు.