: యువకుడి చెంప పగలగొట్టిన నగ్మా
తన అందంతో సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నటి నగ్మా నిన్న ఓ యువకుడి చెంప చెళ్ళుమనిపించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నుంచి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మా నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించింది. దీంతో, నగ్మాను చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను చూడాలని రావడంతో, వారిని కంట్రోల్ చేయడం సెక్యూరిటీకి కూడా కష్టంగా మారింది.
ఈ క్రమంలో, ఆమెను దగ్గర నుంచి చూడాలన్న తపనో లేక తాకుదామన్న ఆకాంక్షో కాని ఓ యువకుడు ఆమెను తాకేశాడు. ఇంకేముంది... నగ్మా కోపం తారస్థాయికి చేరింది. ఆ యువకుడి చెంపను చెళ్ళుమనిపించింది. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే మీరట్ లో అడుగుపెట్టనని ఘటన అనంతరం నగ్మా వ్యాఖ్యానించింది. ఇప్పుడు యూపీలో ఇదే హాట్ టాపిక్.