: గల్లా జయదేవ్ తరపున హీరో సునీల్ ప్రచారం
గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్ విజయం కోసం ప్రచారం చేస్తానని సినీ హీరో సునీల్ ప్రకటించాడు. వ్యాపారవేత్తగా విజయం సాధించి, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి జయదేవ్ రావడం శుభపరిణామమని ఈ సందర్భంగా సునీల్ చెప్పాడు. సూపర్ స్టార్ కృష్ణ ద్వారా తనకు గల్లా కుటుంబంతో అనుబంధం ఏర్పడిందని తెలిపాడు. గుంటూరులోని గల్లా స్వగృహంలో నిన్న గల్లా జయదేవ్ దంపతులను సునీల్ కలిశాడు.