: నేడు టీడీపీలో చేరనున్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే


వైఎస్సార్సీపీకి చెందిన మరో నేత ఈ రోజు సైకిలెక్కనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ప్రస్తుతం ఈయన నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో తలెత్తిన ఇబ్బందుల కారణంతోనే ఈయన పార్టీ మారుతున్నట్టు సమాచారం. నర్సాపురం నియోజకవర్గానికి గతంలో వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జిగా పనిచేసిన రఘురామకృష్ణంరాజు కూడా ఇలాంటి కారణాలతోనే ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News