: హిందుస్థానీ హృదయం ఉంది... అది చాలు: పవన్ కల్యాణ్
రాజకీయ నాయకుల వేష భాషలు తనకు రావని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్నికల సీజన్ కారణంగా ఖద్దరు బట్టలకు డిమాండ్ పెరిగి చాలా ఖరీదైపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు సాయంత్రం విశాఖలో ప్రారంభమైన జనసేన తొలి బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ప్రసిద్ధ హిందీ నటుడు రాజ్ కపూర్ చెప్పినట్లుగా తనకు హిందుస్థానీ హృదయం ఉందని పవన్ పేర్కొన్నారు. వేసుకున్న ప్యాంట్ అమెరికాదైనా, టోపీ రష్యాదైనా మనసు మాత్రం భారత్ దేనని పవన్ స్పష్టం చేశారు. అధికారం కోసమో, ఓట్ల కోసమో రాజకీయాల్లోకి రాలేదని, సామాజిక స్పృహతోనే తాను పార్టీని స్థాపించినట్టు పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.