: కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చా: పవన్
కుళ్ళు రాజకీయాల పట్ల కడుపుమండే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఓట్ల కోసం, పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తాను అందరి నేతల్లా వేషభాషలు పాటించడంలేదని తెలిపారు. అందుకే ఖద్దరు బట్టలు ధరించడంలేదని పేర్కొన్నారు.