: ‘‘మహిళ గర్జన’’ వేదికపై ఆసీనులైన చంద్రబాబు
కృష్ణాజిల్లాలోని విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో ‘‘మహిళ గర్జన’’ సభ ప్రారంభమైంది. విజయవాడ, సింగ్ నగర్లో జరుగుతోన్న ఈ సదస్సు ప్రాంగణానికి టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ‘‘మహిళా గర్జన’’ వేదికనెక్కిన చంద్రబాబుకు మహిళా నేతలు ఘనంగా స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు.