: కొండాపూర్లో బీజేపీ, టీడీపీ పొత్తు చర్చలు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పొత్తులపై చర్చించేందుకు బీజేపీ, టీడీపీ సమావేశమయ్యాయి. హైదరాబాదులోని కొండాపూర్లో జరుగుతున్న ఈ భేటీకి బీజేపీ నుంచి జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్, తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీడీపీ నుంచి సుజనా చౌదరి హాజరయ్యారు. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించనున్నారు.