: మావోయిస్టు వర్గాల మధ్య కాల్పులు... 15 మంది హతం
జార్ఖండ్ సరిహద్దులో ఈ తెల్లవారుజామున రెండు మావోయిస్టు వర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛాత్రా జిల్లా లకర్ బాంద గ్రామంలో జరిగిన ఈ కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. వీరిలో ఏరియా, జోనల్, ప్లాటూన్ కమాండర్ల స్థాయి వారు ఉన్నట్లు సమాచారం. కాగా, విషయం తెల్సుకుని ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు పలు ఆయుధాలను సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్నారు.