: సభా వేదిక వద్దకు బయల్దేరిన పవన్ కల్యాణ్
విశాఖపట్నంలో కాసేపట్లో జనసేన తొలి బహిరంగ సభ ప్రారంభమవుతోంది. విశాఖలోని నోవాటెల్ హోటల్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్, మరికాసేపట్లో సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ బహిరంగ సభలో పవన్ తన మనోభావాలకు అక్షరరూపమిచ్చిన ‘ఇజం’ పుస్తకావిష్కరణ ఉంటుందని సమాచారం. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన విధి విధానాలను, ఎన్నికల ప్రణాళికను కూడా ఆయన అభిమానులకు వివరించనున్నారు.