: యువీపై రోహిత్ విశ్వాసం
టీమిండియా స్టయిలిష్ లెఫ్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్ తరచూ విఫలమవడంపై ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించాడు. యువీ ఫామ్ అందిపుచ్చుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలని తన సీనియర్ పై విశ్వాసం వ్యక్తం చేశాడు. మిర్పూర్లో మీడియాతో మాట్లాడుతూ, 'ఒక్క మ్యాచ్ లో బాగా ఆడితే చాలు, యువీ పుంజుకుంటాడు. గత ప్రపంచకప్పుల్లో అతని చలవతో ఎన్నో మ్యాచ్ లు నెగ్గాం. యువీ ఫామ్ లోకి వస్తే జట్టుకు ఎంతో లాభిస్తుంది' అని పేర్కొన్నాడు.