: రాజకీయంగా చిరంజీవినే అనుసరిస్తాం: రాష్ట్ర చిరంజీవి యువత


రాజకీయ నాయకుడిగా చిరంజీవిని అనుసరిస్తామని, నటుడిగా పవన్ కల్యాణ్ ను అభిమానిస్తామని మెగా ఫ్యాన్స్ పేర్కొన్నారు. హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఈరోజు రాష్ట్ర చిరంజీవి యువత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగబాబు, చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడుతో పాటు, పలువురు ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా ఆదరిస్తామని, రాజకీయ పరంగా మాత్రం చిరంజీవి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే మద్దతు తెలుపుతామని అన్నారు. అభిమానులు అందరూ చిరంజీవి అడుగుజాడల్లో నడువాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఒకరిని అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News