: ఒబామాకు వోడ్కా బంద్ అంటున్న రష్యన్లు


క్రిమియా ప్రాంతం రష్యాలో కలిసిన సందర్భంగా రష్యన్లు దేన్నీ లెక్కచేయడంలేదు. అమెరికాతో పాటు యూరోపియన్ సమాజం కూడా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నా 'డోంట్ కేర్' అంటున్నారు. పైగా, ఆ ఆంక్షలపైనే జోకులేసుకుంటున్నారు. తాజాగా, తమపై ఆంక్షలు విధిస్తే, ప్రతిగా తామూ ఆంక్షలు విధిస్తామని సోషల్ మీడియాలో పేర్కొన్నారు కొందరు రష్యన్లు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఆయన కుటుంబానికి, అమెరికా సెనేటర్లకు వోడ్కా సరఫరా చేయబోమని సరదాగా పోస్టింగ్స్ పెట్టారు. ఇప్పడు నెట్ లో ఇలాంటి జోకులు ఎన్నో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News