: ఆసుపత్రిలో నెల్సన్ మండేలా
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా గతరాత్రి ఆస్పత్రిలో చేరారని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది. 94 సంవత్సరాల ఈ నల్లజాతి యోధుడు గత ఏడాది డిసెంబరు నుంచీ తరచూ అనారోగ్యానికి గురవుతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఇంతకు ముందు మండేలా మూడు వారాల పాటు ఒకసారి, ఈ నెల మొదటి వారంలో మరోమారు ఆస్పత్రిలో చేరి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.