: వెండితెరకు సంజయ్ దత్ జీవిత చరిత్ర!


నటుడు సంజయ్ దత్ జీవిత చరిత్ర త్వరలో వెండితెరకు రానుంది. అన్నీ సవ్యంగా కుదిరితే సంజయ్ జీవితాన్ని ఓ సినిమాగా దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ రూపొందించనున్నారు. ఇందులో రణ్ బీర్ కపూర్ నటించవచ్చని సమాచారం. సంజూ జీవితంలోని ఎత్తుపల్లాలను, సంతోషకర విషయాలను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. పెరోల్ పై కొన్ని రోజుల కిందటవరకు సంజూ బయట ఉన్న సమయంలో ఈ చర్చలు జరిగాయని తెలుస్తోంది.

'సొంత ప్రొడక్షన్ పై తన భర్త జీవితంపై ఓ చిత్రం నిర్మించేందుకు మాన్యత (సంజయ్ భార్య) ఆసక్తిగా ఉన్నారు. కానీ, ఆ ప్రాజెక్టును హిరాణీ చేతనే తెరకెక్కించాలని వారిద్దరూ కోరుతున్నారు' అని ఓ వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం 'పీకే' సినిమాతో బిజీగా ఉన్న హిరాణీ అది పూర్తయ్యేంతవరకూ దేనినీ ఒప్పకునేందుకు సిద్ధంగా లేరని తొలుత చెప్పినప్పటికీ తర్వాత సంజయ్ చిత్రం చేసేందుకు ఓకే చెప్పాడట. త్వరలోనే అందుకు సంబంధించి పనులు మొదలవుతాయని వినికిడి.

  • Loading...

More Telugu News