: విడాకులు తీసుకున్న యుక్తాముఖి దంపతులు
మాజీ విశ్వసుందరి యుక్తాముఖి తన భర్త తులి నుంచి విడాకులు పొందింది. విడిపోవాలని నిర్ణయించుకున్న వారిద్దరి పరస్పర సమ్మతంతో బాంబే హైకోర్టు నిన్న(బుధవారం) విడాకులు మంజూరు చేసింది. 2008లో తులిని వివాహం చేసుకున్న యుక్తా... భర్త హింసిస్తున్నాడంటూ రెండేళ్ల కిందట(2013 జులై) గృహ హింస కేసు పెట్టింది. దాంతో, భర్త కూడా విడాకులు కోరుతూ 2013 మేలో నాగ్ పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు నియమించిన రాజీవ్ పాటిల్ అనే న్యాయవాది యుక్తా, తులి మధ్య మధ్యవర్తిగా పలుసార్లు చర్చలు జరిపారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించేలా చివరకు ఒప్పించారు. దాంతో, జస్టిస్ మృదుల భత్కర్ వారిద్దరికీ విడాకులు మంజూరు చేశారు. అటు తులిపై పెట్టిన గృహహింస కేసులో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.