: తాజ్ మహల్ పై దాడికి ఐఎం పన్నాగం


నిషిద్ధ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) తీవ్రవాద సంస్థ భారత్ లో ఎన్నికల సందర్భంగా సభలనే కాకుండా, సుప్రసిద్ధ పర్యాటక స్థలాలనూ లక్ష్యంగా చేసుకునేందుకు ప్రణాళికలు రచించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. కొన్నిరోజుల క్రితం అరెస్టయిన ఐఎం ఆపరేషన్స్ చీఫ్ తెహ్సీన్ అక్తర్ అలియాస్ మోను విచారణలో ఈ విషయాలు వెల్లడించాడు. గత డిసెంబర్ లో ఆగ్రాతో పాటు పుష్కర్ లోనూ రెక్కీ నిర్వహించామని చెప్పాడు. ఈ ప్రదేశాల్లో బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించాక ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా దాడులు చేయాలన్నది తమ పథకమని వివరించాడీ ముష్కరనేత.

  • Loading...

More Telugu News