: పాక్ సాహస బాలిక మలాల ఇక 'కోటీ'శ్వరి!


ముస్లిం బాలికలకు చదువు యొక్క ఆవశ్యకతను చాటిన ఫలితంగా.. తాలిబన్ల కాల్పుల అకృత్యానికి బలై ప్రాణాల మీదకి తెచ్చుకున్న మలాల యూసఫ్ జాయ్ గుర్తుంది కదూ.. ఈ 15 ఏళ్ల పాకిస్తాన్ చిన్నారి త్వరలోనే కోటీశ్వరురాలిగా మారిపోనుంది. ఎలాగంటే.. మలాల జీవిత జ్ఞాపకాలకు పుస్తక రూపం ఇవ్వడం ద్వారా..

"ఐ యామ్ మలలా" పేరుతో ఈ చిన్నారి తన జీవిత జ్ఞాపకాలను  క్రోడీకరించి పుస్తకాన్ని రాయబోతోంది. ఈ పుస్తకాన్ని వీడెన్ ఫీల్డ్ అండ్ నికల్సన్ అనే ప్రచురణ సంస్థ ముద్రించబోతోంది. అందుకుగాను ఈ చిన్నారికి ఆ సంస్థ మూడు మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించనుంది. ఇండియన్ రూపీస్ లో ఈ విలువ దాదాపు 16కోట్ల పైచిలుకే.. 

దీనిని దృవీకరిస్తూ మలాల ఇలా అంటోంది.. "నేను నా కథ ను చెప్పాలను కుంటున్నాను. ఇది కేవలం నాకథ మాత్రమే కాదు.. చదువుకు దూరమౌతోన్న  61 మిలియన్ చిన్నారుల గాథ " అంటోంది. ఎనీ హౌ.. ఆల్ ద బెస్ట్ మలాల

  • Loading...

More Telugu News