: రాజ్ బబ్బర్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
ఘజియాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటుడు, ఆ పార్టీ నేత రాజ్ బబ్బర్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గం ఘజియాబాద్ లోని పిల్కువా ప్రాంత్రంలో నిర్ణీత సమయం తర్వాత కూడా రోడ్ షో నిర్వహిస్తున్నందుకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రాత్రి పది గంటలవరకు రోడ్ షో నిర్వహించేందుకు బబ్బర్ అనుమతి తీసుకున్నారని... అయితే సమయం దాటిన తర్వాత కూడా రోడ్ షో కొనసాగించారని, అందుకే కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.