: ఇక్కడ సిమ్ ఫ్రీ!
నేపాల్ ప్రభుత్వం వినూత్న పథకానికి తెరదీసింది. తమ దేశంలో నెలవై ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల అధిరోహణకు వచ్చే సాహసికులకు సిమ్ కార్డులు ఉచితంగా అందివ్వాలని నిర్ణయించింది. పర్వత సానువులలోని మారుమూల ప్రదేశాలకు వారు వెళ్ళినప్పుడు ఈ సిమ్ కార్డులు ఎంతో ఉపయుక్తమని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఏడాది వేల సంఖ్యలో పర్వాతారోహకులు నేపాల్ వస్తుంటారు. అయితే, వారిలో ఒంటరిగా అధిరోహణకు ప్రయత్నించేవారిలో అత్యధికులు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో అక్కడి పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ ఫ్రీ సిమ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
'ఓ ట్రెక్కర్ కనిపించకుండా పోతే, అతని సిమ్ కార్డును ట్రాక్ చేయడం ద్వారా అతని ఆచూకీ కనుగొనవచ్చు' అని శరద్ ప్రధాన్ అనే టూరిజం శాఖ అధికారి తెలిపారు. అంతేగాకుండా, ఆ సిమ్ కార్డులో పొందుపరిచిన ప్రత్యేక నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా సాయం పొందవచ్చని కూడా ఆయన చెప్పారు.