: బీజేపీ ప్రచారమంతా... బలుపు కాదు వాపే: రాహుల్ గాంధీ


దేశంలో యూపీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారతీయ జనతాపార్టీ ప్రచార బుడగ త్వరలో పేలిపోవడం ఖాయమని అన్నారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ మాదిరిగానే ఇది కూడా అంటూ... బీజేపీ ప్రచారమంతా బలుపు కాదు వాపే అని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీకి అధికారం ఇవ్వడం అంటే దేశానికి కీడు చేసినట్టేనని రాహుల్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News