: ఎమ్మెల్యేకు చెంపదెబ్బ
హర్యానాలోని ఉక్లానా ఎమ్మెల్యే నరేశ్ సెల్వాల్ కు ఊహించని పరాభవం ఎదురైంది. ఓ యువకుడు ఆగ్రహంతో ఎమ్మెల్యే చెంప పగులగొట్టాడు. హిసార్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సంపత్ సింగ్ తో కలసి నరేశ్ ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సంషేర్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి చెంప చెళ్లుమనిపించాడు. అక్కడున్న వారు ఆ యువకుడిని చితకబాదారు. దీంతో అతడిని క్షమిస్తున్నానని ఎమ్మెల్యే ప్రకటించేశారు. తమ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదనే ఆగ్రహంతోనే అతడీ పని చేసినట్లు సమాచారం.