: ఏసీబీ వలకు చిక్కిన మహిళా ఎస్ఐ
కాయకష్టం చేసుకుంటూ బతుకుతున్న ఓ రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఓ మహిళా ఎస్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హాండెడ్ గా చిక్కింది. ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి హరిసింగ్ అనే రైతును వరంగల్ జిల్లా నెక్కొండ ఎస్ఐ శ్రీదేవి 5 వేలు డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని హరిసింగ్ ఏసీబీకి తెలియజేశాడు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు ఎస్ఐ శ్రీదేవి, గన్ మెన్ వీరన్నలను వలవేసి పట్టుకున్నారు.