: రేపు టీడీపీలో చేరనున్న ఆర్.కృష్ణయ్య
బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తెలంగాణలో ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కృష్ణయ్యను నియమించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొన్న మహబూబ్ నగర్ లో నిర్వహించిన టీడీపీ ప్రజాగర్జనలో కృష్ణయ్య ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా, తెలంగాణలో బీసీ వ్యక్తినే తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి చేస్తామంటూ కొన్ని రోజుల కిందట టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనే (కృష్ణయ్య) సీఎం కావచ్చని ప్రచారం జరుగుతోంది.