: మోడీ ఏకే3 వ్యాఖ్యలపై పార్టీల నిలదీత
ఏకే 47, ఏకే 49(కేజ్రీవాల్), ఏకే ఆంటోనీ ఈ ముగ్గురూ పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ మండిపడ్డాయి. ప్రధాని అభ్యర్థికి ఇవి తగని వ్యాఖ్యలని కేజ్రీవాల్ అన్నారు. మోడీతో ఉంటే దేశ భక్తులు... ఆయనను వ్యతిరేకిస్తే పాకిస్థానీయులా? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ప్రశ్నించారు. సీపీఐ నేత రాజా స్పందిస్తూ.. కేజ్రీవాల్ ను ప్రజలు అంగీకరించనంత మాత్రాన ఆయన్ను పాక్ ఏజెంట్ గా అనడం తగదన్నారు. రక్షణమంత్రిని అసమర్థుడని అనండి కానీ, దేశ ద్రోహి అనడం సరికాదని జేడీయూ నేత త్యాగి సూచించారు. మోడీజీ సైనిక దళాలను అవమానించారన్నారు. .