: నవమి నాడు జరగాల్సిన ఎన్నికలు.. ఏప్రిల్ 11కి వాయిదా
శ్రీరామనవమి పండుగ రోజున.... అంటే ఏప్రిల్ 8న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 8వ తేదీ బదులుగా 11వ తేదీన జరపాలని ఎన్నికల సంఘాన్ని ‘సుప్రీం’ ఆదేశించింది. తాజా సుప్రీం ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థలకు తొలి దశలో 6వ తేదీ, ఆదివారం నాడు, రెండో దశలో 11వ తేదీ, శుక్రవారం నాడు ఎన్నికలను ఈసీ నిర్వహించనుంది.